Telangana: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయం ఇది!

Corona Cases Double in 10 Days in Telugu States

  • ఓ దశలో కేసుల రెట్టింపుకు 3 నుంచి 4 రోజులు
  • ప్రస్తుతం తెలంగాణలో 9.4 రోజులు, ఏపీలో 10.6 రోజులకు రెట్టింపు కేసులు
  • జాతీయ సగటు7.5 రోజుల కన్నా ఎగువన 18 రాష్ట్రాలు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రపంచ దేశాల్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి కేవలం 3 నుంచి 4 రోజుల సమయం మాత్రమే పట్టింది. వివిధ దేశాల్లో లాక్ డౌన్ ను విధించిన తరువాత, ఈ సమయం మెల్లగా పెరుగుతూ వచ్చింది. ఇదే వివరాలను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి అవుతున్న సమయాలను ప్రకటించింది. జాతీయ సగటు 7.5 రోజులని, వారం రోజుల వ్యవధిలో కేసులు డబుల్ అవుతున్నాయని వెల్లడించింది.

ఇక జాతీయ సగటుకు ఎగువన 18 రాష్ట్రాలు ఉన్నాయని, ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగానే కరోనా కేసుల సంఖ్య పెరుగుదల నిదానిస్తోందని తెలిపింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి తెలంగాణలో 9.4 రోజులు, ఏపీలో 10.6 రోజుల సమయం పడుతోందని కేంద్రం వివరించింది.

ఇక మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే, ఢిల్లీలో 8.5 రోజులు, కర్ణాటకలో  9.2 రోజులు, జమ్మూ కశ్మీర్ లో 11.5 రోజులు, పంజాబ్‌ లో 13.1 రోజులు, ఛత్తీస్‌ గఢ్‌ లో 13.3 రోజులు, తమిళనాడులో 14 రోజులు, బిహార్‌ లో 16.4 రోజులకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందని పేర్కొంది. ఒడిశా, కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో 20 నుంచి 30 రోజులుగా ఈ సమయం ఉందని తెలిపింది. ఒడిశాలో 39.8 రోజులకు, కేరళలో 72.2 రోజులకు రోగుల సంఖ్య రెట్టింపు అవుతోందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News