Andhra Pradesh: ఏపీలో పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగుల తొలగింపు కేసు.. మూడు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు

Three weeks deadline to ap government
  • రంగులను తొలగించాలన్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ
  • మూడు వారాల గడువు కోరిన రాష్ట ప్రభుత్వం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం
ఏపీలో పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ జెండాను పోలిన రంగులను తొలగించాలన్న పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల గడువు కోరగా అందుకు న్యాయస్థానం అంగీకరించింది. మూడు వారాల గడువు లోగా పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులు తొలగించి కొత్త రంగులు వేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Andhra Pradesh
Panchayati buildings
colours
AP High Court

More Telugu News