Adivi Sesh: దర్శకుల పనిలో నేనెప్పుడూ జోక్యం చేసుకోను: అడివి శేష్

Major Movie

  • వరుస విజయాలతో అడివి శేష్
  • సెట్స్ పై 'మేజర్'  సినిమా
  • చర్చల దశలో 'గూఢచారి' సీక్వెల్

అడివి శేష్ కి కథాకథనాలపై మంచి పట్టువుంది. నటుడిగాను ఆయన తనదైన ప్రత్యేకతను కనబరుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 'మేజర్' సినిమా చేస్తున్నాడు. అలాగే మరోపక్క 'గూఢచారి' సినిమా సీక్వెల్ ను పట్టాలెక్కించే పనులు చేయిస్తున్నాడు. అడివి శేష్ కి ఈ మధ్య కాలంలో వరుస విజయాలు దక్కుతున్నాయి. దాంతో ఆయన దర్శకుల పనిలో జోక్యం చేసుకుంటూ వాళ్లను విసిగిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ .. "కథాకథనాల విషయంలో నేను కూర్చుంటాను. కానీ దర్శకుల పనిలో జోక్యం చేసుకుంటాననే విషయంలో ఎంత మాత్రం నిజం లేదు. దర్శకుల ప్రతిభాపాటవాల కారణంగానే నాకు విజయాలు దక్కాయనీ, ఈ రోజున ఈ స్థానంలో వున్నానని భావిస్తున్నాను. వాళ్ల క్రెడిట్ ను కొట్టేయాలని నేనెప్పుడూ అనుకోలేదు" అని చెప్పుకొచ్చారు.

Adivi Sesh
Major Movie
Tollywood
  • Loading...

More Telugu News