Pavan Kalyan: 'బద్రి' షూటింగులో ఇబ్బంది పడ్డాను: రేణు దేశాయ్

Renu Desai

  • 'బద్రి' సినిమా వచ్చి నేటికీ 20 ఏళ్లు
  • రేణు దేశాయ్ తొలి పరిచయం
  •  షూటింగు కష్టాలు అధిగమించామన్న రేణు

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బద్రి' ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 20 ఏళ్లు అయింది. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకి రేణు దేశాయ్ పరిచయమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి తాజాగా రేణు దేశాయ్ ప్రస్తావిస్తూ, 'బంగాళా ఖాతంలో .. 'అంటూ సాగే ఒక పాట షూటింగ్ సమయంలో తీసిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

"విదేశాల్లో సిటీకి దూరంగా వుండే ఒక రిమోట్ ఏరియాలో  షూటింగు జరిగింది. షాట్ గ్యాప్ లో అక్కడ కూర్చోవడానికి కూడా ఏమీ ఉండేవి కాదు. అక్కడ ఒక బండ వుంటే పవన్ దానిపై కూర్చున్నారు. నేను షార్ట్ స్కర్ట్ వేసుకున్న కారణంగా ఆ బండపై కూర్చోలేకపోయాను. 'ఒక అమ్మాయి మీ పక్కన నిలబడి ఉండగా కూర్చోవడం బ్యాడ్ మేనర్స్' అంటూ కల్యాణ్ గారితో సరదాగా జోక్ చేశాను కూడా. అది గాలి బాగా వీచే ప్రదేశం కావడంతో నిలబడటం, డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా వుండేది" అని చెప్పుకొచ్చారు.

Pavan Kalyan
Renu Desai
Puri Jagannadh
  • Loading...

More Telugu News