Puri: దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి .. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో చేయలేకపోయిన పూరి

Puri Movies

  • 20 ఏళ్ల క్రితం ఈ రోజునే వచ్చిన 'బద్రి'
  • మాస్ దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్
  • సెట్ కాని చిరూ .. వెంకీ కాంబినేషన్

తెలుగులోని అగ్రదర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకులలో ఆయన ముందువరుసలో కనిపిస్తారు. మాస్ ఇమేజ్ కోరుకునే హీరోలు ఆయన సినిమాల్లో చేయాలని ఆరాటపడుతుంటారు. పూరి తొలి చిత్రమైన 'బద్రి' ..  2000 సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీన .. అంటే ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కల్యాణ్  కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా 'బద్రి' కనిపిస్తుంది.

ఆ తరువాత ఆయన మహేశ్ బాబు .. ప్రభాస్ .. ఎన్టీఆర్ .. చరణ్ .. అల్లు అర్జున్ .. రామ్ వంటి యువ కథానాయకులతో హిట్లు కొట్టారు. సీనియర్ స్టార్ హీరోల్లో నాగార్జున .. బాలకృష్ణ .. రవితేజలతోను సినిమాలు చేశారు. ఈ 20 ఏళ్లలో 35 సినిమాలను తెరకెక్కించిన ఆయన, చిరంజీవి .. వెంకటేశ్ లతో మాత్రమే చేయలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి పట్టాలెక్కలేదు. ఆ లోటును పూరి భర్తీ చేసుకుంటాడేమో చూడాలి.

Puri
Chiranjeevi
Venkatesh
Tollywood
  • Loading...

More Telugu News