Missamma: 83 ఏళ్ల వయసులోనూ... టీవీలో 'మిస్సమ్మ' చూస్తూ మైమరచి నృత్యం చేసిన జమున... వీడియో!

Jamuna Latest Dance for Missamma Dance
  • తాజాగా టీవీలో ప్రసారమైన మిస్సమ్మ చిత్రం
  • శరీరానికే తప్ప మనసుకు వయసు లేదని నిరూపించిన జమున
  • నెట్టింట వైరల్ అవుతున్న జమున నృత్యం
తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలువదగిన ఎవ‌ర్ గ్రీన్ చిత్రాల్లో ఒకటైన 'మిస్సమ్మ' చిత్రం, తాజాగా టీవీలో వస్తుంటే దాన్ని చూసిన సీనియర్ నటి జమున మైమరచిపోయారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్‌, సావిత్రి, ఎస్వీ రంగారావు తదితర దిగ్గజాలతో పాటు జమున కూడా నటించారన్న సంగతి తెలిసిందే. ఇక, సినిమా చూస్తుంటే నాటి మధురస్మృతులు గుర్తుకు వచ్చాయో ఏమో... శరీరానికే తప్ప మనసుకు వయసు ఉండదని నిరూపించారు. జమున డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే సుమారు 20 వేల మంది వీక్షించారు. జమున నృత్యాన్ని మీరూ చూడవచ్చు.
Missamma
Jamuna
Dance

More Telugu News