E-Commerce: ఈ-కామర్స్ సైట్లలో ఎలక్ట్రానిక్స్ తదితర వస్తువుల అమ్మకాలపై కేంద్రం యూటర్న్!

Centre revised its decision over non essential goods

  • ఈ నెల 20 నుంచి వివిధ కార్యకలాపాలకు కేంద్రం అనుమతి
  • ఈ-కామర్స్ సైట్లలో నిత్యావసరాలు మాత్రమే విక్రయించాలన్న కేంద్ర హోంశాఖ
  • ఇతర వస్తువుల అమ్మకాలకు అనుమతి అవసరమని స్పష్టీకరణ

లాక్ డౌన్ నేపథ్యంలో, ఏప్రిల్ 20 నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా విక్రయించుకోవచ్చంటూ ఇంతకుముందు పేర్కొన్న కేంద్రం ఇప్పుడు మరో ప్రకటన చేసింది. ఈ-కామర్స్ సైట్లలో కేవలం నిత్యావసర వస్తువులు, పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులు మాత్రమే విక్రయించాలని, ఇతర వస్తువులకు అనుమతి తప్పనిసరి అని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

ఈ-కామర్స్ సంస్థలు, ఈ-కామర్స్ కార్యకలాపాలు నిర్వహించే ఆపరేటర్లకు చెందిన వాహనాలకు తగిన అనుమతులు అవసరమని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి అనేక సంస్థలకు, కార్యకలాపాలకు కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News