Chiranjeevi: రక్తదానం చేసిన హీరో చిరంజీవి

Chiranjeevi donates Blood

  • లాక్ డౌన్ ఎఫెక్ట్ బ్లడ్ బ్యాంకులపై పడకుండా  ప్రయత్నం
  • చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసిన చిరు
  • ‘కరోనా’ జాగ్రత్తల్లో భాగంగా మాస్క్ ధరించిన చిరంజీవి

లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అత్యవసర సేవలు అందించే బ్లడ్ బ్యాంకులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా ఉండేందుకు, వాటిలో రక్త నిల్వలు తగ్గకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రక్తదానం చేయదలచుకున్న వారు చేస్తున్నారు. ఈ మధ్యనే టాలీవుడ్ హీరో నాని దంపతులు రక్తదానం చేశారు. తాజాగా, ప్రముఖ హీరో చిరంజీవి రక్తదానం చేశారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఆయన రక్తదానం చేశారు. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన పాటించారు.

Chiranjeevi
Tollywood
blood
donation
Chiranjeevi Blood Bank
  • Loading...

More Telugu News