Kanna Lakshminarayana: అన్నవరం కొండపై క్వారంటైన్ కేంద్రం ఏర్పాట్లు తగదు: ఏపీ సీఎస్ కు కన్నా లేఖ

AP BJP Leader Kanna writes a letter to CS Sahni

  • ఎక్కడా స్థలం లేనట్టు కొండపై ఏర్పాట్లా?
  • హిందూ ఆలయాలకు చెందిన సత్రాల్లో క్వారంటైన్ కేంద్రాలు వద్దు
  • ఈ మేరకు జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని కోరిన కన్నా

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై ఉన్న హరిహర సదన్ లో క్వారంటైన్ కేంద్రం ఏర్పాట్లు చేయాలని అధికారులు లేఖ రాయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఓ లేఖ రాశారు. ఎక్కడా స్థలం లేనట్టు కొండపై ఏర్పాట్లు చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. హిందూ ఆలయాలకు చెందిన సత్రాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా జిల్లాల కలెక్టర్లను ఆదేశించాలని ఆ లేఖలో కోరారు. అన్నవరం కొండ ఎంత పవిత్రమైందో అందరికీ తెలిసిందేనని, అక్కడ కల్పించిన వసతులన్నీ హిందువుల కోసం చేసినవేనని గుర్తుచేశారు. ఈ కొండపై నిర్మించిన సత్రాలన్నీ దాతలు, భక్తుల సహకారంతో చేపట్టినవేనని చెప్పారు.

Kanna Lakshminarayana
BJP
Andhra Pradesh
CS
Neelam Sahni
  • Loading...

More Telugu News