Thermal Screening: థర్మల్ స్క్రీనింగ్‌ల వల్ల ఉపయోగం లేకుండా పోయింది: ఐసీఎంఆర్
- శరీర ఉష్ణోగ్రత ఆధారంగా బాధితులను కనిపెట్టే థర్మల్ స్క్రీనింగ్
- 46 శాతం మందిని కనిపెట్టలేకపోయిందని అంచనా
- జనవరి 15కు ముందు దేశంలోకి 5700 మంది
కరోనా బాధితులను గుర్తించేందుకు చేసిన థర్మల్ స్క్రీనింగ్ వల్ల సత్ఫలితాలు రాలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఫిబ్రవరిలోనే పేర్కొన్నట్టు ఆ సంస్థ జర్నల్‌లో వచ్చిన కథనం ఆధారంగా తెలుస్తోంది. శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా కరోనా బాధితులను గుర్తించేందుకు విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేపట్టినా 46 శాతం మంది ప్రయాణికులను అది కనిపెట్టలేకపోయి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
రోగలక్షణాలు కనిపించకపోవడంతో చాలామంది తప్పించుకుని ఉంటారని పేర్కొంది. జనవరి 15న విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ టెస్టు ప్రారంభించారు. అయితే అంతకంటే ముందే కరోనా ప్రభావిత దేశాల నుంచి 5,700 మంది ప్రయాణికులు దేశానికి వచ్చారు. వారిలో కేవలం 17 మందిలో మాత్రమే కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రులలో చేరారని ఐసీఎంఆర్ తెలిపింది.