VV Vinayak: అయోమయంలో పడేస్తున్న 'శీనయ్య'

Seenayya Movie

  • దర్శకుడిగా వినాయక్ కి మంచి క్రేజ్
  •  హీరోగా సరికొత్త ప్రయోగం
  • నిర్మాతగా 'దిల్' రాజు  

వినాయక్ పేరు వినగానే వరుసగా కొన్ని సూపర్ హిట్ చిత్రాల పేర్లు గుర్తుకు వస్తాయి. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పాళ్లను సమంగా కలిపి మాస్ ఆడియన్స్ ను అలరించడం ఆయన ప్రత్యేకత. అలాంటి వినాయక్ కి ఇటీవల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఆయన హీరోగా మారిపోయాడు. నరసింహా అనే దర్శకుడితో 'శీనయ్య' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'దిల్' రాజు నిర్మాతగా వున్నాడు.

వినాయక్ కి స్క్రిప్ట్ నచ్చకపోవడం .. అవుట్ పుట్ నచ్చకపోవడం .. తరచూ స్క్రిప్టులో మార్పులు చెప్పడం వంటి కారణంగా ఈ సినిమా షూటింగులో జాప్యం జరుగుతూ వచ్చిందట. ఈ ప్రాజెక్టు విషయంలో 'దిల్' రాజు విసిగిపోయాడనీ, ఆయన పట్టించుకోవడం మానేశారనే టాక్ వినిపిస్తోంది. మరో వైపున లాక్ డౌన్ తరువాత ప్రాజెక్టు ముందుకు వెళుతుందని మరికొందరు అంటున్నారు. ఇలా 'శీనయ్య' అభిమానులందరినీ అయోమయానికి గురి చేస్తున్నాడు.

VV Vinayak
Dil Raju
Narasimha
Seenayya Movie
  • Loading...

More Telugu News