Rajamouli: నా తదుపరి సినిమా మహేశ్ బాబుతోనే ఉంటుంది: రాజమౌళి

  • నా తదుపరి సినిమా నిర్మాత కేఎల్ నారాయణ
  • నెక్స్ట్ మూవీ హీరో ప్రభాస్ కాదు
  • 'ఆర్ ఆర్ ఆర్' తరువాత పట్టాలెక్కుతుందన్న రాజమౌళి  
Rajamouli says his next Movie with Mahesh

రాజమౌళి తదుపరి సినిమా ఏ హీరోతో ఉండనుంది అనే విషయం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభాస్ తో ఉంటుందని కొంతమంది అంటుంటే, మహేశ్ బాబుతో ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. తాజాగా టీవీ 9 ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ, ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

'డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక సినిమా .. కేఎల్ నారాయణ నిర్మాతగా ఒక సినిమా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలోనే చేస్తున్నాను. ఆ తరువాత సినిమా కేఎల్ నారాయణ నిర్మాణంలో వుంటుంది. ఆ సినిమా ప్రభాస్ తో కాదు .. మహేశ్ బాబుతో ఉంటుంది. కేఎల్ నారాయణ నిర్మాణంలో మహేశ్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తానని చాలా కాలంగా చెబుతూ వస్తున్నాను. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది" అని ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News