Mahesh Babu: మహేశ్ బాబు మూవీలో శ్రద్ధా కపూర్?

Parashuram Movie

  • పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు
  • పాన్ ఇండియా మూవీగా మార్చే ఆలోచన
  • 'సాహో' తరువాత శ్రద్ధా కపూర్ కి ఛాన్స్?  

మహేశ్ బాబు తదుపరి సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన తదుపరి సినిమాకి పరశురామ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మహేశ్ బాబు జోడీ కట్టే హీరోయిన్ ఎవరనే విషయంలో అందరిలో ఆసక్తి వుంది.

ఈ క్రమంలో కీర్తి సురేశ్ తో పాటు కొంతమంది కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రద్ధా కపూర్ పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ లో శ్రద్ధా కపూర్ కి మంచి క్రేజ్ వుంది. తెలుగులో ఆమె ప్రభాస్ సరసన 'సాహో' సినిమా చేసింది. ఆ సినిమా ఇక్కడ ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేదు. ఆ తరువాత ఆమె తెలుగు సినిమాలకి సైన్ చేయలేదు. పరశురామ్ తో మహేశ్ బాబు చేయనున్న సినిమా కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందిస్తారట. అందువలన బాలీవుడ్ నుంచి శ్రద్ధా కపూర్ ను తీసుకునే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు.

Mahesh Babu
Shraddha Kapoor
Parashuram
  • Loading...

More Telugu News