Telangana: తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 766

Total corona cases in Telangana 766

  • ఇవాళ ఒక్కరోజే కొత్తగా మరో 66 కేసులు నమోదు
  • ఇప్పటి వరకు 18 మంది మృతి
  • మీడియా బులిటిన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో ‘కరోనా’ కేసులు మరిన్ని పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే కొత్తగా మరో 66 కేసులు నమోదైనట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మీడియా బులిటిన్ ను విడుదల చేసింది. ఇప్పటి వరకు ‘కరోనా’ నుంచి కోలుకుని 186 మంది బాధితులు డిశ్చార్జి కాగా, 18 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 766కు చేరినట్టు రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Telangana
COVID-19
health minister
Etela Rajender
  • Loading...

More Telugu News