Chiranjeevi: 'ఆచార్య'లో కీలకమైన పాత్రలో మోహన్ బాబు?

Mohanbabu in Acharya Movie

  • చిరంజీవి తాజా చిత్రంగా 'ఆచార్య'
  • ప్రత్యేక పాత్రలో కనిపించనున్న చరణ్
  • మోహన్ బాబు కోరిక మేరకు పాత్రలో మార్పులు

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ కనిపించనుండగా, ఒక ప్రత్యేకమైన పాత్రను చరణ్ పోషించనున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన రోల్ కోసం మోహన్ బాబును తీసుకోనున్నారనేది తాజా సమాచారం.

ఈ సినిమాలో కామెడీ టచ్ వున్న నెగెటివ్ రోల్ ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం మోహన్ బాబును చిరంజీవి అడిగితే, కామెడీ టచ్ లేకుండా పూర్తి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర అయితే చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని మోహన్ బాబు చెప్పారట. దాంతో ఆ పాత్రను అలాగే డిజైన్ చేయమని చిరంజీవి చెప్పడంతో, కొరటాల స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో వున్నాడని అంటున్నారు. పాత్ర నచ్చితే మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. గతంలో చిరూ .. మోహన్ బాబు ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

Chiranjeevi
Mohan Babu
Koratala Siva
Acharya Movie
  • Loading...

More Telugu News