Chandrababu: 12 గంటల్లో 8,622 పరీక్షలు ఎలా చేశారు? అన్నీ బూటకపు లెక్కలే: చంద్రబాబు

Chandrababu questions AP Government corona test stats

  • సీఎం డ్యాష్ బోర్డుకు, ఆరోగ్యశాఖ లెక్కలకు పొంతనలేదన్న చంద్రబాబు
  • హెల్త్ బులెటిన్ల నిండా బోగస్ అంకెలేనంటూ ఆగ్రహం
  • జిల్లా లెక్కలకు, రాష్ట్ర లెక్కలకు తేడా వస్తోందని వెల్లడి

ఏప్రీ ప్రభుత్వం కరోనా వైరస్ నివారణ చర్యలపై అవాస్తవాలు చెబుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. కరోనా పరీక్షలపై కేంద్రానికి, ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగాలు చెబుతున్న లెక్కలకు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలకు తేడాలున్నాయని ఆరోపించారు. కరోనా పరీక్షలను బూటకంగా మార్చారని, కరోనా కేసులపై ప్రభుత్వ హెల్త్ బులెటిన్లను బోగస్ అంకెలతో నింపేస్తున్నారని విమర్శించారు.

సీఎం డ్యాష్ బోర్డు అంకెలకు, ఆరోగ్యశాఖ కార్యదర్శి లెక్కలకు పొంతనలేదని, మొన్న సాయంత్రం 11,613 శాంపిల్స్ పరీక్ష చేసినట్టు డ్యాష్ బోర్టులో పేర్కొన్నారని, నిన్న ఉదయానికి 20,235 పరీక్షలు చేసినట్టు చూపించారని చంద్రబాబు ఆరోపించారు. 12 గంటల వ్యవధిలో 8,622 పరీక్షలు ఎలా చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 7 ల్యాబ్ లలో రోజుకు 990 పరీక్షలు చేస్తామని మీరే చెప్పారు... మరి ఒక్కసారిగా ఇన్ని పరీక్షలు ఎక్కడ చేశారో చెప్పాలి? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

  • Loading...

More Telugu News