Kanna Lakshminarayana: ఏపీలో ‘కరోనా’ వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కన్నా డిమాండ్

Kanna Lakshmi Narayana writes a letter
  • ప్రభుత్వ వైఖరిపై ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి
  • ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
  • సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాసిన కన్నా
‘కరోనా’ నేపథ్యంలో సీఎం జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ వైఖరి వల్ల ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

రాష్ట్రంలో ఎన్ని టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయో, క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల సమాచారం ఇవ్వాలని అదే విధంగా, ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లొచ్చిన వారిని ఎంత మందిని గుర్తించారన్న వివరాలను తెలియజేయాలని కోరారు. ‘కరోనా’పై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
Kanna Lakshminarayana
BJP
Jagan
YSRCP

More Telugu News