Narendra Modi: ఆర్‌బీఐ చేసిన ప్రకటన దేశంలోని పేదలను ఆదుకునేలా ఉంది: ప్రధాని మోదీ

PM Narendra Modi says RBIs steps today will enhance liquidity

  • దేశంలో ద్రవ్య లభ్యత మెరుగ్గా పెరుగుతుంది
  • ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంది
  • ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, రైతులు, పేదలకు ఉపకరించేలా ఉన్నాయి
  • రాష్ట్రాలకు డబ్ల్యూఎంఏను కూడా పెంచారు

బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ రోజు ఆర్‌బీఐ చేసిన ప్రకటనతో దేశంలో ద్రవ్య లభ్యత పెరుగుతుందని, బ్యాంకు రుణాల వృద్ధి పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఆర్‌బీఐ తీసుకున్న ఈ చర్యలు దేశంలోని చిన్న తరహా, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, రైతులు, పేదలకు ఉపకరించేలా ఉన్నాయని మోదీ చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యూఎంఏ)ను కూడా పెంచారని, దీంతో రాష్ట్రాలకు కూడా మేలు చేకూరుతుందని చెప్పారు.  

కాగా, శక్తికాంత దాస్ ప్రకటించిన చర్యలు కారణంగా దేశీయ రూపాయి విలువ డాలరు మారకంలో 45 పైసలు పుంజుకుంది. ఆయన ప్రకటన చేయకముందు 76.59 వద్ద ఉన్న రూపాయి మారకం విలువ ఆయన ప్రకటన చేసిన అనంతరం కొద్ది సేపటికే పుంజుకుని 76.42 కి చేరింది. కాగా,  రెపోరేటు యథాతథంగా ఉంటుందని, రివర్స్‌ రెపోరేటు మాత్రమే 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆయన వివరించారు. రివర్స్ రెపోరేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రాలకు 60 శాతం మేర డబ్ల్యూఎంఏ పెంచుతున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News