Andhra Pradesh: మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం
- ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు బాసట
- కుటుంబానికి రూ. 10 వేల పరిహారం
- ప్రారంభమైన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ
వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. లాక్ డౌన్ తో పాటు చేపల వేటపై నిషేధం కారణంగా మూడు నెలల పాటు మత్స్యకారులు ఉపాధిని కోల్పోయారు. వేట విరామ సాయాన్ని అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. పడవలపై పని చేస్తున్న కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. 20 రోజుల్లో వీరికి సాయం అందించాలని నిర్ణయించారు.