Vishwak Sen: నా అభిమాన హీరో ఎన్టీఆర్: హీరో విష్వక్సేన్

Vishwak Sen

  • నా దృష్టిలో బెస్ట్ డాన్సర్ ఎన్టీఆర్
  • హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు
  • నానీతో కలిసి నటించాలని ఉందన్న విష్వక్సేన్  

కథానాయకుడిగా విష్వక్సేన్ విభిన్నమైన పాత్రలను చేస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన 'హిట్' సినిమా నటన పరంగా ఆయనను మరోమెట్టుపైన నిలబెట్టింది. తాజా ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, అనేక విషయాలను పంచుకున్నాడు.

"తెలుగులో నేను ఎక్కువగా అభిమానించే హీరో ఎన్టీఆర్. టాలీవుడ్ హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఆయన. ఏ సీన్ అయినా సింగిల్ టేక్ లో చేయడం ఆయన ప్రత్యేకత. ఇక స్టైలీష్ హీరో అల్లు అర్జున్ అయితే .. హ్యాండ్సమ్ హీరోగా మహేశ్ బాబు కనిపిస్తాడు. మల్టీస్టారర్ సినిమాలు చేసే అవకాశం వస్తే, నానీతో కలిసి నటించాలని కోరుకుంటాను. ఇక దర్శకుల విషయానికొస్తే, నా అభిమాన దర్శకుడిగా తరుణ్ భాస్కర్ పేరు చెబుతాను" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

Vishwak Sen
Junior NTR
Mahesh Babu
Nani
  • Loading...

More Telugu News