Ratnadeep: డీమార్ట్ బాటలోనే రత్నదీప్ సూపర్ మార్కెట్... సీజ్ చేసిన అధికారులు!

Ratnadeep Supermarket Sease by GHMC

  • లాక్ డౌన్ నిబంధనలు పాటించని రత్నదీప్
  • హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ శాఖలో తనిఖీలు
  • సీజ్ చేసి, నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ నిబంధనలను విధిగా పాటించాలంటూ, అధికారులు ఎంత మొత్తుకుంటున్నా, వినని సూపర్ మార్కెట్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. పలు సూపర్‌మార్కెట్లు నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, దాడులు జరుపుతున్న అధికారులు, ఆరోపణలు నిజమని తేలితే, ఆయా సూపర్ మార్కెట్లను సీజ్ చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం హైదరాబాద్, ఎల్బీ నగర్‌ లోని డీమార్ట్‌ కు షాకిచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అధికారులు, తాజాగా శ్రీనగర్‌ కాలనీలో ఉన్న రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌ ను సీజ్‌ చేశారు. ఈ మార్కెట్ కు తనిఖీ నిమిత్తం అధికారులు వెళ్లిన వేళ, అక్కడ కస్టమర్లతో పాటు స్టోర్ సిబ్బంది కూడా సామాజిక దూరాన్ని పాటించడం లేదు. వ్యక్తిగత శుభ్రతా పరికరాలు కూడా అందుబాటులో లేవు. సూపర్‌ మార్కెట్‌ కు వచ్చేవారికి శానిటైజర్లు అందుబాటులో ఉంచాల్సిన యాజమాన్యం ఆ ఏర్పాట్లు చేయలేదు. దీంతో అధికారులు మార్కెట్ ను సీజ్‌ చేస్తూ, నోటీసులు అందించారు.

Ratnadeep
Super Market
Hyderabad
Sease
GHMC
  • Loading...

More Telugu News