Hyderabad: హైదరాబాద్ లో తండ్రి కళ్లెదుటే యువతిని కిడ్నాప్ చేసే యత్నం... సీసీటీవీ దృశ్యాలివి!

Kidnap attempt caught on camera in Hyderabad

  • హుమాయూన్ నగర్ పరిధిలో ఘటన
  • తండ్రి కళ్లలో కారం కొట్టిన దుండగులు
  • పోలీసు కేసు నమోదు

హైదరాబాద్ లో పట్టపగలే బరితెగించిన కొందరు దుండగులు, తన తండ్రితో కలిసి వస్తున్న ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, యువతి కుటుంబానికి పరిచయం ఉన్న సల్మాన్ మీర్జా బేగ్, అతని నలుగురు స్నేహితులు, పథకం ప్రకారం, యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. పాతబస్తీలోని హుమాయూన్ నగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తండ్రి మహమ్మద్ షరీఫ్ తో కలిసి ఆమె, కూరగాయలు కొనుక్కునే నిమిత్తం వస్తుంటే, తొలుత తండ్రి కళ్లలో కారం కొట్టారు.

ఆపై ఆమెను ఎత్తుకెళ్లేందుకు తీసుకుని వచ్చిన కారులోకి నెట్టేందుకు ప్రయత్నించారు. ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ ఉండటం, చుట్టు పక్కల వారు సమీపంలోకి రావడంతో, వారిని వదిలేసి పరారయ్యారు దుండగులు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ నకు యత్నించిన దృశ్యాల వీడియోను మీరూ చూడవచ్చు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News