Donald Trump: లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కిన ఇవాంకా ట్రంప్... సెలబ్రేషన్స్ కోసం భర్తతో కలిసి ప్రయాణం!

Ivanka Travelled with Husbend in Lockdown Time

  • న్యూజర్సీకి భర్తతో ప్రయాణం
  • ట్రంప్ గోల్ఫ్ రిసార్టులో వేడుకలు
  • సోషల్ మీడియా వేదికగా ప్రజల ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్ నర్ లు లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ అమలులో ఉండగా, ఫెడరల్ నిబంధనలను అతిక్రమించి, వీరు సెలబ్రేషన్స్ కోసం వాషింగ్టన్ నుంచి న్యూజర్సీ వెళ్లారు. వీరి ప్రయాణాన్ని వైట్ హౌస్ కూడా ఖరారు చేసింది. న్యూజర్సీలోని బెడ్ మినిస్టర్ ప్రాంతంలో ట్రంప్ కు ఉన్న గోల్ఫ్ రిసార్టుకు వీరు వెళ్లారని, ఏప్రిల్ 8 నుంచి, 16 వరకూ జరిగే జ్యూయిష్ హాలిడే నిమిత్తం వెళ్లారని వైట్ హౌస్ తెలిపింది.

వీరి ప్రయాణంలో ఇతరులు ఎవరూ లేరని, వీరు తగు జాగ్రత్తలు తీసుకునే తమ ప్రయాణాన్ని సాగించారని స్పష్టం చేసింది. ఆమె ప్రయాణం సాగించిన ప్రాంతంలో జనసాంధ్రత చాలా తక్కువని తెలిపింది. ఆమె ప్రయాణం వాణిజ్యపరమైనది కాదని, బెడ్ మినిస్టర్ ప్రాంతంలోనూ ఆమె సామాజిక దూరాన్ని పాటించారని, అక్కడి నుంచి కూడా ఆమె పని చేశారని పేర్కొంది.

కాగా, ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో అనవసర ప్రయాణాలు చేయకుండా ప్రజలపై నిషేధం అమలులో ఉంది. కరోనా మహమ్మారి యూఎస్ లో ప్రబలిన నేపథ్యంలో, ట్రంప్ సర్కారు దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్ కోసం స్వయంగా ట్రంప్ కుమార్తె ప్రయాణం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక గత నెలాఖరులో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలంటూ వీడియో సందేశాన్ని ఇచ్చిన ఇవాంకా, ఇప్పుడు తనే వేడుకల్లో పాల్గొనడం ఏంటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

Donald Trump
Ivanka Trump
Jared Kushner
Journey
New Jercy
Corona Virus
Lockdown
  • Loading...

More Telugu News