Kiara Aswani: పారితోషికం తక్కువిస్తే చేయనని నేను అనలేదు: కైరా అద్వాని

Kiara Adwani

  • హిందీ సినిమాలతో బిజీగా వున్నాను
  •  కథ నచ్చితేనే తెలుగులో చేస్తాను
  •  పారితోషికం ప్రస్తావనే లేదన్న కైరా

తెలుగు తెరకి 'భరత్ అనే నేను' సినిమాతో కైరా అద్వాని పరిచయమైంది. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కైరా అద్వాని, ఆ తరువాత 'వినయ విధేయరామ' చేసింది. ఈ సినిమా ఆశించినస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత నుంచి కైరా తెలుగు సినిమాలు చేయడం లేదు.

తెలుగు నుంచి ఆఫర్స్ వెళితే భారీగా పారితోషికం అడుగుతోందనే వార్తలు వచ్చాయి. తాను అడిగిన దానికి తక్కువగా పారితోషికం ఇస్తే చేయనని నిర్మొహమాటంగా చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కైరా వరకూ వెళ్లడంతో ఆమె స్పందించింది. "తెలుగు నుంచి నాకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. అయితే హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే నేను తెలుగు సినిమాలు చేయలేకపోతున్నాను. తెలుగులో కథ .. నా పాత్ర నచ్చినప్పుడే ఓకే చెప్పాలనే నిర్ణయంతో వున్నాను. అంతేగానీ పారితోషికం తక్కువైతే చేయనని నేను ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు" అంటూ స్పష్టత ఇచ్చింది.

Kiara Aswani
Actress
Bollywood
  • Loading...

More Telugu News