Mahesh Babu: 'ఒక్కడు'లో ఓబుల్ రెడ్డి పాత్రను మిస్సైన గోపీచంద్

Okkadu Movie

  • 'నిజం'లో విలన్ గా చేసిన గోపీచంద్
  • 'ఒక్కడు'లో ఛాన్స్ ఇవ్వలేకపోయిన ఎమ్మెస్ రాజు
  • 'వర్షం'లో విలన్ గా మెప్పించిన గోపీచంద్

గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'ఒక్కడు' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మహేశ్ బాబు స్టార్ డమ్ ను పెంచిన సినిమా ఇది. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా 'ఓబుల్ రెడ్డి' పాత్రలో ప్రకాశ్ రాజ్ అదరగొట్టేశాడు. ఆ పాత్రకి ముందుగా గోపీచంద్ ను అనుకున్నారట.

అయితే అప్పటికే గోపీచంద్ .. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'నిజం' సినిమాలో విలన్ పాత్రకి ఎంపిక అయ్యాడు. దాంతో రెండు సినిమాల్లోనూ విలన్ గోపీచంద్ అయితే బాగుండదేమోననే అభిప్రాయాన్ని మహేశ్ బాబు వ్యక్తం చేయడంతో, ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నారు. 'ఒక్కడు' సినిమాలో గోపీచంద్ కి అవకాశం ఇవ్వలేకపోయామనే ఫీలింగ్ ఎమ్మెస్ రాజుకి ఉండేదట. అందువల్లనే ఆ తరువాత నిర్మించిన 'వర్షం' సినిమాలో ప్రతినాయకుడిగా గోపీచంద్ కి అవకాశం ఇచ్చారు. ఆ పాత్ర గోపీచంద్ కి ఎంత పేరు తీసుకొచ్చిందో తెలిసిందే.

Mahesh Babu
Gopi Chand
Guna Sekhar
Okkadu Movie
  • Loading...

More Telugu News