Rakul Preet Singh: మురికివాడలోని కుటుంబాలను దత్తత తీసుకున్నాం: సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్

Artist Rakul preeth singh charity

  • లాక్ డౌన్ కారణంగా పేదలకు అండగా నిలవాలనుకున్నాం
  • గుర్గావ్ లో 250 కుటుంబాలను దత్తత తీసుకున్నాం
  • రెండు పూటలా ఆహారపదార్థాలు అందజేస్తున్నాం

లాక్ డౌన్ నేపథ్యంలో రోజు వారీ కూలిపని చేసి సంపాదించుకునే వారికి టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబం  అండగా నిలిచింది. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా తెలియజేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. గుర్గావ్ లోని మురికివాడ ప్రాంతంలో నివసిస్తున్న 250 కుటుంబాలను దత్తత తీసుకున్నామని చెప్పింది.

తన తండ్రి పర్యవేక్షణలో వారికి రెండు పూటలా ఆహారపదార్థాలు అందజేస్తున్నామని చెప్పింది. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ పేదలకు ఆహారం అందిస్తున్నామని తెలిపింది. ‘కరోనా’ బారిన పడకుండా ఉండేందుకు ఇప్పటికే సూచించిన జాగ్రత్తలను ప్రజలు పాటించాలని కోరింది.

  • Loading...

More Telugu News