Nimmagadda Ramesh: నాడు ఎస్ఈసీ హోదాలో కేంద్రానికి లేఖ రాసింది నేనే!: నిమ్మగడ్డ రమేశ్ కుమార్

Ex SEF Nimmagadda Ramesh kumar clarification
  • నాకున్న అధికార పరిధిలోనే ఆ లేఖ రాశాను
  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కూడా దీనిని నిర్ధారించారు
  • ఇక దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు
కేంద్ర హోం శాఖ కార్యదర్శికి  లేఖ రాసిన వివాదంపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు. నాడు ఎస్ఈసీ హోదాలో కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానేనని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్ గా తనకు ఉన్న అధికార పరిధిలోనే ఆ లేఖ రాశానని, దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కూడా ఈ లేఖను నిర్ధారించారని, ఇక దీనిపై ఎలాంటి వివాదాలు, రాద్ధాంతాలకు తావు లేదని అన్నారు.
Nimmagadda Ramesh
Ex-SEC
letter
central home secretary

More Telugu News