Nara Lokesh: జీవీఎంసీ కమిషనర్ సృజనపై నారా లోకేశ్ ప్రశంసల వర్షం!

Nara Lokesh praises GVMC commissioner srujana

  • ఒక నెల క్రితం బిడ్డకు జన్మనిచ్చిన సృజన
  • ‘కరోనా’ కట్టడి కోసం బాధ్యతగా విధుల్లో చేరడంపై ప్రశంస
  • మనందరి గౌరవం పొందడానికి ఆమె నిజంగా అర్హురాలు

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ (జీవీఎంసీ) ఐఏఎస్ అధికారిణి గుమ్మళ్ల సృజనపై టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఒక నెల క్రితం బిడ్డకు జన్మనిచ్చిన సృజన, మహమ్మారి ‘కరోనా’పై పోరాడేందుకు ఓ సైనికురాలిలా వచ్చి తన విధుల్లో చేరారని, మనందరి గౌరవాన్ని పొందడానికి ఆమె నిజంగా అర్హురాలని కొనియాడారు.
కాగా, తనకున్న ఆరు నెలల ప్రసూతి సెలవులను రద్దు చేసుకుని మరీ ఇటీవలే ఆమె విధుల్లో చేరారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడానికి బిడ్డను ఎత్తుకుని కార్యాలయానికి ఆమె వెళ్లడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News