Love Agarwal: దేశ వ్యాప్తంగా ‘కరోనా’ హాట్ స్పాట్ జిల్లాలు 170: లవ్ అగర్వాల్

170 Hot spot districts in India

  • దేశ వ్యాప్తంగా కొవిడ్-19 హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించాం
  • భారత్ లో ‘కరోనా’ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ స్థాయికి చేరలేదు 
  • హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం

‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్స్ గా గుర్తించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఢిల్లీలో ఇవాళ ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా కొవిడ్-19 హాట్ స్పాట్ కేంద్రాలు, నాన్ హాట్ స్పాట్ కేంద్రాలు, గ్రీన్ జోన్లను గుర్తించామని అన్నారు.

భారత్ లో ‘కరోనా’ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ స్థాయికి చేరలేదని స్పష్టం చేశారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,439కి చేరిందని, దీని బారిన పడి 377 మంది మృతి చెందారని అన్నారు.

Love Agarwal
central health ministry
Corona Virus
  • Loading...

More Telugu News