Allu Arjun: 'పుష్ప'లో హైలైట్ గా నిలవనున్న రష్మిక పాత్ర

Pushpa Movie

  • వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక
  • 'పుష్ప'లో గిరిజన యువతి లుక్
  • ఆమె పాత్రలో అనూహ్యమైన ట్విస్ట్ అంటూ టాక్

ప్రస్తుతం రష్మిక టైమ్ నడుస్తోంది. వరుస సినిమాలతో .. వరుస విజయాలతో దూసుకుపోతోంది. బన్నీ కథానాయకుడిగా సుకుమార్ చేస్తున్న సినిమాలోనూ ఆమెనే కథానాయిక. ఈ సినిమాలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించే లారీ డ్రైవర్ గా బన్నీ కనిపించనున్నాడు. చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడుతూ, పూర్తి మాస్ లుక్ తో సందడి చేయనున్నాడు. 

ఇక రష్మిక పాత్ర కూడా పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఒక గిరిజన యువతిగా ఆమె పాత్ర ఎంటరవుతుందని చెబుతున్నారు. కథ పాకాన పడుతుండగా ఆమె పాత్రలో ట్విస్ట్ ఆడియన్స్ కి షాక్ ఇస్తుందని అంటున్నారు. ఇంతవరకూ రష్మిక చేసిన పాత్రలు ఒక ఎత్తు .. ఈ పాత్ర ఒక ఎత్తు అని చెబుతున్నారు. రష్మిక కెరియర్లో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అవుతుందనే అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే ఈ పాత్రతో రష్మిక రేంజ్ మరింత పెరగనున్నట్టే అనిపిస్తోంది.

Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa Movie
  • Loading...

More Telugu News