Rammadhav: ‘కరోనా’ నేపథ్యంలో అమెరికన్ సీఈఓ ఒకరు రీడిజైన్ చేసిన ‘ఇండియన్ మ్యాప్’ ఇది!: బీజేపీ నేత రామ్ మాధవ్
- ఇండియా మ్యాప్ లో ఇతర దేశాలు
- కొన్ని రాష్ట్రాలలో ఉన్న జనాభా చిన్న దేశాలలో జనాభాకు సమానం
- ఆయా దేశాలు ‘కోవిడ్’పై వ్యవహరిస్తున్నట్టు భారత్ ఒక్కటే పరోక్షంగా అలా వ్యవహరిస్తోంది
‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యలపై భారతదేశం ఏవిధంగా సమర్ధవంతంగా ముందుకు వెళ్తోందో తెలియజెప్పేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. అమెరికన్ సీఈఓ ఒకరు రీడిజైన్ చేసిన ‘ఇండియన్ మ్యాప్’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు.
భారతదేశ చిత్ర పటంలో మన రాష్ట్రాలకు బదులుగా ఇతర దేశాలు ఉండటం ఆ మ్యాప్ లో కనబడుతుంది. భారత్ లోని కొన్ని రాష్ట్రాలలో ఉన్న జనాభా, కొన్ని చిన్న దేశాలలో జనాభాకు దాదాపు సమానంగా వుందని ఆ సీఈఓ చేసిన వ్యాఖ్యలను రామ్ మాధవ్ ప్రస్తావించారు. వివిధ దేశాలలో ఉన్నటువంటి ‘కోవిడ్-19’ పరిస్థితులను భారత్ పరోక్షంగా ఎలా హ్యాండిల్ చేస్తున్నది తన ఉద్యోగులకు ఆ సీఈఓ తెలియజెప్పే ప్రయత్నం చేశారని ఆ పోస్ట్ లో రామ్ మాధవ్ పేర్కొన్నారు.