Prabhas: ప్రభాస్ సినిమా కోసం ఇంతవరకూ అయిన ఖర్చు 130 కోట్లు?

Radhakrishna Kumar Movie

  • పునర్జన్మల నేపథ్యంలో సాగే కథ
  • 20 రోజుల పాటు జరగవలసిన షూటింగ్
  • భారీ వసూళ్లు ఖాయమంటున్న ఫ్యాన్స్

ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ ఒక భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ వారు .. కృష్ణంరాజు కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విదేశాల్లో సాగే పునర్జన్మలతో ముడిపడిన ప్రేమకథ ఇది. కొంతవరకూ విదేశాల్లో చిత్రీకరించారు. మరి కొంతభాగాన్ని హైదరాబాద్ లో భారీ సెట్స్ వేసి చిత్రీకరించారు.

ఇంతవరకూ 130 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట. ఇంకా 20 రోజుల పాటు షూటింగు చేయవలసి ఉందని సమాచారం. ఈ 20 రోజుల్లో మరో 30 .. 40 కోట్ల ఖర్చు కానుందని అంటున్నారు. బడ్జెట్ పరంగా చూసుకుంటే, ఈ సినిమా 200 కోట్లకి పైగా వసూళ్లను సాధించవలసి ఉంటుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ప్రభాస్ కి గల క్రేజ్ కారణంగా, పెట్టుబడి వెనక్కి రావడం పెద్ద కష్టమేమీ కాదనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Prabhas
Pooja Hegde
Radhakrishna Kumar Movie
  • Loading...

More Telugu News