Corona Virus: దేశంలో కరోనా మళ్లీ విజృంభణ.. రెండు రోజుల్లో 28 శాతం వృద్ధి

Indias coronavirus curve picks up pace again

  • టాప్‌-5  జిల్లాల్లోనే 63 శాతం కేసులు
  • ఏడు రోజుల్లో రెట్టింపైన కేసుల సంఖ్య
  • ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ మెరుగే

దేశంలో కరోనా వైరస్‌ మరింతగా విస్తరిస్తోంది. గడచిన రెండు రోజుల్లో  కరోనా కేసుల  సంఖ్య 28 శాతం పెరిగింది. మంగళవారం రాత్రి వరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన సమాచారం మేరకు దేశంలో 10,815 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు 48 గంటలతో పోలిస్తే ఈ రెండు రోజుల్లో తీవ్రత కాస్త ఎక్కువగా  ఉంది.

అయితే, మిగతా ఆసియా దేశాలైన సింగపూర్, జపాన్, ఇండోనేసియా, పాకిస్థాన్‌లతో పోలిస్తే ఇండియాలో పరిస్థితి ఇంకా అదుపులోనే ఉంది. గత ఏడు రోజుల్లో ఇండియాలో కేసుల సంఖ్య రెట్టింపైంది. కేసుల వృద్ధి ఇలానే ఉంటే మరో ఆరు రోజుల్లో  మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 20 వేలకు చేరనుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడకపోతే పరిస్థితి చేయిదాటి, కొన్ని నెలల్లోనే  దేశంలోని ఆసుపత్రులన్నీ నిండిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యతో పోలిస్తే మరణాల రేటు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం సాయంత్రం వరకు 353 మంది చనిపోయారు. ఐదు రోజుల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపైంది. మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి అక్కడ 1,948 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది.

ఢిల్లీ 1452 కేసులతో రెండో  స్థానంలో ఉండగా.. తమిళనాడు 1104 పాజిటివ్ కేసులతో మూడో ప్లేస్‌లో ఉంది. రాజస్థాన్‌లో 743 మంది, మధ్యప్రదేశ్‌ లో 629 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 63 శాతం కేసులు ఉండడం గమనార్హం. భారత్‌ లో ఇప్పటిదాకా 393 జిల్లాలకు కరోనా వైరస్ పాకింది. 

  • Loading...

More Telugu News