ICMR: భారత్‌లో 25 గబ్బిలాల్లో తొలిసారి 'బ్యాట్‌ కరోనా వైరస్‌' గుర్తించాం: ఐసీఎంఆర్‌ ప్రకటన

ICMR study finds presence of bat coronavirus in two Indian bat species

  • కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి, తమిళనాడుల్లో గుర్తింపు
  • మనుషులకు హానికరమన్న ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టత
  • నిఫా వైరస్‌పై పరిశోధనలు చేస్తుండగా గుర్తింపు
  • కొనసాగుతున్న పరిశోధనలు

మనుషుల్లో కరోనా విజృంభణ నేపథ్యంలో రెండు రకాల గబ్బిలాల జాతుల్లో 'బ్యాట్ కరోనా వైరస్‌'ను తొలిసారి భారతీయ పరిశోధకులు గుర్తించారు. కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి, తమిళనాడుల్లో గబ్బిలాల్లో ఈ వైరస్‌ను తొలిసారి గుర్తించినట్లు వివరించారు. ఈ విషయంపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటన చేసింది.

అయితే, బ్యాట్‌ కరోనా వైరస్‌ మనుషులకు హానికరమన్న ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టతనిచ్చింది. 25 గబ్బిల్లాల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. ప్రస్తుతం మానవాళిని పీడిస్తోన్న కరోనా వైరస్‌కు, బ్యాట్‌ కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఐసీఎంఆర్‌ అధ్యయనం జరిపి తెలిపింది.

ఇండియన్ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో బ్యాట్‌ కరోనా వైరస్‌పై పూర్తి వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీతో కలిసి నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడైనట్లు ఐసీఎంఆర్‌ అందులో పేర్కొంది. కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరిలోని రౌసెటస్, టెరోపస్ ( ఇండియన్‌ ఫ్లయింగ్‌ ఫాక్స్‌ ) అనే రెండు రకాలకు చెందిన గబ్బిలాల్లో 'బ్యాట్‌ కరోనా వైరస్‌'ను గుర్తించినట్లు తెలిపింది.
                                                  
                                                                       
2018, 2019 ఏడాదుల్లో ఈ గబ్బిలాల వల్ల కేరళలో నిఫా వైరస్ వ్యాపించి, అప్పట్లో ఆ రాష్ట్రంలో 17 మంది మృతి చెందారు. అలాగే, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు,పంజాబ్‌, గుజరాత్‌, ఒడిశా, చండీగఢ్‌ల్లో ఉండే పలు రకాల గబ్బిలాలపై ఈ పరిశోధన నిర్వహించినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రకటించింది.

కొత్తగా గబ్బిలాల్లో గుర్తించిన  వైరస్‌ వల్ల మనుషుల్లో ఇన్‌ఫెక్షన్లు వంటివి కలుగుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. గత ఏడాది కేరళను వణికించిన నిఫా వైరస్‌కు సంబంధించి పరిశోధకులు రీసెర్చ్‌ జరుపుతూ గబ్బిలాల శరీర స్రావాలను పరీక్షించగా వాటిలో ఈ కరోనా వైరస్ ఉన్న విషయం ఉందని తేలింది. అయితే, మనుషుల్లో గుర్తించిన కరోనా వైరస్‌కు, గబ్బిలాలకు మధ్య సంబంధంపై మాత్రం పరిశోధనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News