RGV: కరోనాను ఎన్‌కౌంటర్‌ చేయాలి.. సీపీ సజ్జనార్ విడుదల చేసిన ఈ పాటను షేర్‌ చేయండి: వర్మ

ramgopal varma on corona song

  • కరోనా విజృంభణ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాట
  • 'ఓరోరి ఓరినా ఫ్రెండు' పాటను రచించిన ఎస్‌ఐ లాల్‌మధార్‌
  • పోస్ట్ చేసిన  సైబరాబాద్‌ పోలీసులు
  • ఏ రీల్‌ హీరో విడుదల చేయలేదని వర్మ వ్యాఖ్య

కరోనా విజృంభణ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్‌ఐ లాల్‌మధార్‌ రచించిన 'ఓరోరి ఓరినా ఫ్రెండు' పాటను సైబరాబాద్‌ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉండాలని, కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు సమాజంలోని వారినీ కాపాడాలని ఈ పాట ద్వారా సందేశం ఇచ్చారు.

ఈ వీడియోను రీట్వీట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఈ 'నా ఫ్రెండు' ‌పాటను ఫ్రెండ్లీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లాల్‌మధార్ రచించారు. లాక్‌డౌన్‌ గురించి చెబుతూ కరోనా వైరస్‌ను ఎన్‌కౌంటర్‌ చేయాల్సిందేనని సందేశమిచ్చారు. ఈ పాటను ఏ సినిమా రీల్‌ హీరో విడుదల చేయలేదు.. కానీ రియల్లీ రియల్‌ హీరో ది గ్రేట్‌ కమిషనర్‌ ఆఫ్ పోలీస్ సజ్జనార్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాటను తప్పకుండా విని షేర్‌ చేయండి' అంటూ అభిమానులకు వర్మ సూచించారు.

RGV
Tollywood
Corona Virus
Police
  • Error fetching data: Network response was not ok

More Telugu News