Simran Khanna: భర్త నుంచి విడాకులు తీసుకున్న హిందీ సీరియల్స్ నటి సిమ్రాన్ ఖన్నా

Actress Simran Khanna takes divorce from husband
  • భర్త నుంచి విడిపోయిన సిమ్రాన్ ఖన్నా
  • ఇద్దరి మార్గాలు వేరని చెప్పిన నటి
  • తమ కొడుకు భర్త వద్దే ఉంటాడని వ్యాఖ్య
కుటుంబ బంధాలు నానాటికీ చాలా బలహీనంగా మారుతున్నాయి. చిన్నచిన్న విషయాలకు కూడా భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్లిపోతున్నారు. సినీ పరిశ్రమలో ఇది మరీ ఎక్కువగా ఉంది. ఎంతో మంది సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకున్నారు. తాజాగా హిందీ సీరియల్స్ నటి సిమ్రాన్ ఖన్నా తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. పలు సీరియల్స్ లో సిమ్రాన్ ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సందర్భంగా సిమ్రాన్ మాట్లాడుతూ, ఇద్దరి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పింది. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని తెలిపింది. ఇద్దరి మార్గాలు వేరని అర్థం కావడంతో... ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పింది. తమ కుమారుడు భర్త వద్దే ఉంటాడని తెలిపింది.
Simran Khanna
Actress
Divorce

More Telugu News