KTR: తెలంగాణ బాండ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడడం పట్ల కేటీఆర్ హర్షం

KTR overjoys after Telangana state bonds offering received overwhelming response

  • నిధుల సమీకరణకు తెలంగాణ ప్రభుత్వం యత్నాలు
  • రూ.2 వేల కోట్లు సమీకరించేందుకు బాండ్ల అమ్మకం
  • బాండ్లు కొనేందుకు పోటీలు పడిన 287 సంస్థలు

కరోనా వైరస్ వ్యాప్తితో సకలం నిలిచిపోయిన పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రంగానికి ఉత్సాహం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. రూ.2 వేల కోట్ల నిధుల సమీకరణ కోసం బాండ్లను విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా, ఆ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన బిడ్డింగ్ కు అనేక సంస్థలు పోటీ పడ్డాయి. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో ఏకంగా 287 కంపెనీలు పాల్గొన్నాయి. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరోసారి వెల్లడైందని, రాష్ట్ర బాండ్ల అమ్మకానికి విపరీతమైన స్పందన వచ్చిందని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News