Srinu Vaitla: మనస్పర్థలను పక్కన పెట్టి 'ఢీ 2' ప్లాన్ చేస్తున్న శ్రీను వైట్ల!

Dhee 2 Movie

  • కొంతకాలంగా శ్రీను వైట్ల - కోన వెంకట్ మధ్య మనస్పర్థలు
  • ఇటీవల మనసు మార్చుకున్న కోన వెంకట్
  • కలుపుకుపోయే ప్రయత్నంలో శ్రీను వైట్ల 

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'ఢీ' ఒకటిగా కనిపిస్తుంది. కథ, మాటలు కోన వెంకట్ అందించిన ఈ సినిమాలో, మంచు విష్ణు - జెనీలియా జంటగా నటించారు. నిన్నటితో ఈ సినిమా 13 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం.

కొంతకాలంగా శ్రీను వైట్ల .. కోన వెంకట్ మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణం లేదు. అందువలన శ్రీను వైట్ల సినిమాలకి కోన వెంకట్ పని చేయడం లేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడుతూ, శ్రీను వైట్లతో కలిసి పనిచేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. అంతేకాదు కొన్ని కథలను శ్రీను వైట్ల మాత్రమే హ్యాండిల్ చేయగలడంటూ అభినందించాడు. ఇక శ్రీను వైట్ల కూడా ఈగోలు పక్కన పెట్టేసి, కోన వెంకట్ -  గోపీమోహన్ లతో 'ఢీ 2' చేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగాడని అంటున్నారు. కొంతమంది సన్నిహితులు వీళ్లందరినీ కలిపే కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

Srinu Vaitla
Kona Venkat
Dhee 2 Movie
  • Loading...

More Telugu News