JP Nadda: మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి: సోనియాగాంధీకి బీజేపీ చీఫ్ చురక

JP Nadda commets Sonia Gandhi

  • మోదీ ప్రకటనకు ముందు వీడియో మెసేజ్ విడుదల చేసిన సోనియా
  • కరోనాపై పోరాటంలో ప్రజలకు అండగా ఉంటామని వ్యాఖ్య
  • సోనియా రాజకీయాలు చేస్తున్నారన్న నడ్డా

లాక్ డౌన్ పొడిగింపుకు సంబంధించి ప్రధాని మోదీ ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పెట్టిన వీడియో మెసేజ్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సెటైరిక్ గా స్పందించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా కరోనాపై పోరాటంలో ప్రజలందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందని వీడియోలో ఆమె అన్నారు.

దీనిపై ట్విట్టర్ ద్వారా నడ్డా స్పందిస్తూ, 'థాంక్యూ సోనియా జీ... మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి' అని కామెంట్ చేశారు. దీనికి ముందు కూడా సోనియాపై నడ్డా విమర్శలు గుప్పించారు. అందరూ కలసికట్టుగా నిలబడాల్సిన సంక్షోభ సమయంలో  సోనియాగాంధీ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు, లాక్ డౌన్  ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

JP Nadda
Narendra Modi
Sonia Gandhi
BJP
Congress
Corona Virus
  • Loading...

More Telugu News