Mahesh Babu: కృష్ణ పుట్టినరోజున మహేశ్ మూవీ లాంచ్

 Mahesh movie will be launched on Krishnas birthday
  • పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు
  • మే 31వ తేదీన పూజా కార్యక్రమాలు
  • వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన
'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో హిట్ కొట్టేసిన మహేశ్ బాబు, తన తదుపరి సినిమాను సెట్ చేసుకునే విషయంలో అనుకోకుండా ఆలస్యం జరిగిపోయింది. అందువలన ఆయన తన తదుపరి సినిమాను సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టేయాలనే ఆలోచనలో వున్నాడట. ఆయన తన తదుపరి సినిమాను పరశురామ్ తో చేయనున్నాడు.

గతంలో మహేశ్ బాబుతో 'శ్రీమంతుడు'ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు ఇప్పుడీ సినిమాను నిర్మించనున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను కృష్ణ పుట్టిన రోజైన మే 31వ తేదీన లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత రెగ్యులర్ షూటింగుకు వెళ్లే దిశగానే పనులను పూర్తి చేస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.
Mahesh Babu
prashuram
Mytri Movie Makers

More Telugu News