Mahesh Babu: రాజమౌళి తదుపరి సినిమా హీరోగా మహేశ్ బాబు?

Rajamouli Movie

  • ప్రస్తుతం షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ లతో ఒకటికి మించి చేసేసిన రాజమౌళి
  • గతంలోనే హింట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్  

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఈ సినిమా కోసం ఇటు ఎన్టీఆర్ అభిమానులు .. అటు చరణ్  ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి తదుపరి సినిమా గురించి కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఏ హీరోతో ఆయన సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు వున్నాయనే చర్చలు ఫిల్మ్ నగర్లో జోరుగా జరుగుతున్నాయి.

రాజమౌళి తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉండొచ్చుననే టాక్ బలంగా వినిపిస్తోంది. మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా తప్పకుండా ఉంటుందని ఇంతకుముందు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన హింట్ .. ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇక టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో ఆల్రెడీ ఎన్టీఆర్ .. చరణ్ .. ప్రభాస్ లతో రాజమౌళి ఒకటికి మించిన సినిమాలు చేశారు. అందువలన ఈ సారి మహేశ్ బాబుతో చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

Mahesh Babu
Rajamouli
Tollywood
  • Loading...

More Telugu News