Allu Arjun: 'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి రౌతేలా

Pushpa Movie

  • అడవి నేపథ్యంలో సాగే 'పుష్ప'
  • ప్రత్యేక ఆకర్షణగా ఐటమ్ సాంగ్
  • తెలుగు తెరకి ఊర్వశి రౌతేలా

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ 'పుష్ప' సినిమాను రూపొందిస్తున్నాడు. 'నాన్నకు ప్రేమతో' కథను ఫారిన్ నేపథ్యంలోను .. 'రంగస్థలం' కథను గ్రామీణ నేపథ్యంలోను నడిపించిన సుకుమార్, 'పుష్ప' కోసం అడవి నేపథ్యాన్ని ఎంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకున్నారు.

సుకుమార్ సినిమాల్లో కథాకథనాల విషయాన్ని పక్కన పెడితే, ఐటమ్ సాంగ్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది.  ఆయన సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ దుమ్మురేపేస్తాయి .. మాస్ ఆడియన్స్ ను హుషారెత్తిస్తాయి. అలాంటి స్పెషల్ సాంగ్ కోసం కైరా అద్వానితో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా తెరపైకి  'ఊర్వశి రౌతేలా' పేరు వచ్చింది. ఆమె ఎంపిక ఖరారైపోయిందనే అంటున్నారు. ఈ బాలీవుడ్ భామకి విపరీతమైన క్రేజ్ వుంది. ఆమె తెలుగు తెరపై తొలిసారి కనిపించనుండటం, ఈ సినిమాకి కలిసొచ్చే అంశమేనని చెప్పొచ్చు.

Allu Arjun
Rashmika Mandanna
Urvasi Rautela
  • Loading...

More Telugu News