Saritha: కరోనాపై పాట పాడిన ఏపీ అడిషనల్ ఎస్పీ సరిత... ప్రత్యేకంగా విడుదల చేయించిన పోలీసు శాఖ!

AP Additional SP Saritha Song on Corona

  • కరోనాపై అవగాహన నిమిత్తం పాట
  • పోలీసు శాఖ సేవల్లో భాగంగా చిరు ప్రయత్నం
  • వైరల్ అవుతున్న పాట

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ వంతు ప్రయత్నాలు చేశారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎంతో మంది గేయ రచయితలు, సంగీత దర్శకులు కలిసి పాటలను తయారు చేశారు. ఏపీలో ప్రస్తుతం మహిళా రక్షణ విభాగంలో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేజీవీ సరిత, కరోనాపై పాడిన పాటను, ఏపీ పోలీసు శాఖ ప్రత్యేకంగా విడుదల చేసింది.

"వద్దురా అన్న... బయటకు రాకురోయన్న... వద్దన్నా నువ్వు వస్తే... కాటేస్తుంది కరోనా" అంటూ సాగే ఈ పాట, ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ఉంది. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలను అడ్డు పెట్టారని, ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి వైరస్ బారిన పడవద్దని వినసొంపుగా సరిత ఆలపించారు.

తమ తుపాకులు, అణు ఆయుధాలు కరుడుగట్టిన కరోనాను అణచలేవని, బయటకు రాకుండా ఉండటమే ప్రజలకు రక్షని తెలియజేశారు. సరదాలు, షికార్లు తీర్చుకునేందుకు యువత బయటకు రావద్దని సూచించారు. తామంతా కంటికి నిద్ర లేకుండా కాపలా కాస్తున్నామని తనలోని బాధను వివరించారు. ప్రజలకు అండగా పోలీసులు ఉంటారని, అంతా కలిసి మహమ్మారిని అంతం చేద్దామని పిలుపునిచ్చారు. సరిత పాడిన పాటను మీరూ వినవచ్చు.

కాగా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు తమ పోలీసు శాఖ చేస్తున్న సేవల్లో భాగంగా, ఇది తన చిరు ప్రయత్నమని ఈ సందర్భంగా సరిత వ్యాఖ్యానించారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News