Allu Arjun: 'పుష్ప' సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి?

Pushpa Movie

  • లాక్ డౌన్ కారణంగా జరుగుతున్న ఆలస్యం
  • డేట్లు సర్దుబాటు చేయలేని విజయ్ సేతుపతి
  • బాబీ సింహాను తీసుకునే ఆలోచనలో సుకుమార్  

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. అక్రమ కలప రవాణా చేసే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడనేది తాజా సమాచారం.

'పుష్ప' సినిమా షూటింగు అనుకున్న సమయానికి మొదలుకాలేదు. కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. లాక్ డౌన్ మరింత ఆలస్యానికి కారణమైంది. అయితే లాక్ డౌన్ తరువాత విజయ్ సేతుపతి డేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితి లేదట. ఈ ఒక్క సినిమా చేయాలంటే తమిళంలో ఆయన రెండు మూడు సినిమాలు వదులుకోవలసి వస్తోందట. అందువలన ఆయన 'పుష్ప' నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతో ఆయన స్థానంలో బాబీసింహాను తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నట్టు సమాచారం.

Allu Arjun
Rashmika Mandanna
Pushpa Movie
  • Loading...

More Telugu News