telugu states: వారణాసిలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు: జీవీఎల్

GVL Arranged Bus Facilities to all pilgrims from Telugu states whoever stranded in Varanasi

  • వారికి అండగా నిలిచిన ఎంపీ జీవీఎల్
  • ఇప్పటికే 12 బస్సుల్లో బయల్దేరారని వెల్లడి
  • మరో ఆరు బస్సులు ఏర్పాటు చేసినట్టు ట్వీట్

లాక్‌డౌన్ కారణంగా వారణాసిలో చిక్కుకున్న తెలుగు యాత్రికులకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అండగా నిలిచారు. వాళ్లను సొంత ప్రదేశాలకు తీసుకొచ్చేందుకు చొరవ తీసుకున్నారు. వారందరినీ  తెలుగు రాష్ట్రాలకు రప్పించేందుకు బస్సులు ఏర్పాటు చేసినట్టు జీవీఎల్ ట్వీట్ చేశారు.

తెలుగు యాత్రికులను ఎక్కించుకొని ఇప్పటికే 12 బస్సులు బయల్దేరాయని ఆయన తెలిపారు. మరో ఆరు బస్సులు ఈ రోజు బయల్దేరుతాయని  చెప్పారు. యాత్రికులతో వస్తున్న బస్సుల వీడియోను కూడా పోస్ట్ చేసిన జీవీఎల్‌.. ఈ ట్వీట్‌ను ఏపీ బీజేపీ, పవన్ కల్యాణ్, జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులకు ట్యాగ్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News