Junior NTR: అట్లీ కుమార్ తోనే ఎన్టీఆర్ 31వ మూవీ?

Atlee Kumar Movie

  • తాజా చిత్రంగా సెట్స్ పై 'ఆర్ ఆర్ ఆర్'
  • తదుపరి సినిమా త్రివిక్రమ్ తో
  • లాక్ డౌన్ సమయంలో కథలు వింటున్న ఎన్టీఆర్ 

ఎన్టీఆర్ తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆయన త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. కెరియర్ పరంగా ఎన్టీఆర్ కి ఇది 30వ సినిమా. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ ఇంట్లోనే ఉంటున్నాడు. తన తదుపరి సినిమాకి సంబంధించి మంచి కథను సెట్ చేసుకునే పనిలో ఆయన ఉన్నాడనే టాక్ వచ్చింది.

యువ దర్శకులు చాలా మంది ఆయనను ఒప్పించడానికి తమ కథలతో ప్రయత్నాలు చేస్తున్నారు. వైవిధ్యభరితమైన కథ అనిపిస్తే, ఆ కథనే 31వ సినిమాగా సెట్స్ పైకి తీసుకెళదామనీ, లేదంటే గతంలో అట్లీ కుమార్ వినిపించిన కథను పట్టాలెక్కించాలని ఎన్టీఆర్ ఆలోచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఎన్టీఆర్ కి కొత్త కథలేవీ నచ్చకపోతే మాత్రం, అట్లీ కుమార్ రంగంలోకి దిగిపోవడం ఖాయమన్నమాట.

Junior NTR
Trivikram Srinivas
Atlee Kumar
  • Loading...

More Telugu News