A;apati Rajendra Prasad: కనగరాజ్ కు క్వారంటైన్ అవసరం లేదా? జగన్ సర్కారుపై టీడీపీ మండిపాటు
- హైదరాబాద్ నుంచి వస్తే చంద్రబాబు క్వారంటైన్ పాటించాలన్న వైసీపీ నేతలు
- చెన్నై నుంచి వచ్చిన జస్టిస్ కనగరాజ్ ను క్వారంటైన్ ఎందుకు చేయలేదు?
- ప్రశ్నించిన టీడీపీ సీనియర్ నేత ఆలపాటి
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీకి రావాలంటే, 14 రోజుల క్వారంటైన్ పాటించాల్సిందేనని వైసీపీ నాయకులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో, తమిళనాడు నుంచి వచ్చిన కనగరాజ్ క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదా? అంటూ తెలుగుదేశం పార్టీ మండిపడింది. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎస్ఈసీగా నియమితులైన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, చెన్నై నుంచి వచ్చారని గుర్తు చేశారు. ఆయన్ను ఎందుకు క్వారంటైన్ చేయలేదని ప్రశ్నించారు. కోర్టు ఎన్నిమార్లు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ, జగన్ సర్కారు పట్టించుకోకుండా ముందుకు వెళుతోందని ఆలపాటి విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో గ్రామ, వార్డు వాలంటీర్లతో ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు.