India: భారత్‌లో మరింత పెరిగిపోయిన కరోనా కేసులు.. మరణాలు
- 24 గంటల్లో 909 కేసులు
- కరోనా కేసుల మొత్తం సంఖ్య 8,356
- 24 గంటల్లో దేశంలో 34 మంది మృతి
- ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 273
భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగిపోయింది. భారత్‌లో 24 గంటల్లో 909 కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా భారత్‌లో భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసుల మొత్తం సంఖ్య 8,356కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
24 గంటల్లో దేశంలో 34 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 7,367 మంది కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. 716 మంది కోలుకున్నారు. 273 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
మహారాష్ట్రలో ఇప్పటివరకు అత్యధికంగా 1761 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఢిల్లీలో 1069 మందికి కరోనా సోకగా వారిలో 19 మంది మృతి చెందారు. తమిళనాడులో 969 మందికి కరోనా సోకగా, వారిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్‌లో 452 మందికి కరోనా సోకింది. వారిలో 45 మంది కోలుకోగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో 532, తెలంగాణలో 504, గుజరాత్‌లో 432, ఆంధ్రప్రదేశ్‌లో 381, కేరళలో 364 మందికి కరోనా సోకింది. ఛత్తీస్‌గఢ్‌లో 19 మందికి, జమ్మూకశ్మీర్‌లో 207 మందికి, లఢక్‌లో 15 మందికి కరోనా సోకింది.
అసోంలో 29 మందికి, మణిపూర్, త్రిపురలో ఇద్దరి చొప్పున, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక్కరి చొప్పున కరోనా సోకింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.