KCR: 'మీ మీద భరోసాతో ఎన్ని రోజులైనా...' కేసీఆర్ పై బండ్ల గణేశ్ ట్వీట్ల వర్షం!

Bandla Ganesh Praises CM KCR

  • దేశ చరిత్రలో ఇటువంటి సీఎం లేరు
  • 40 రోజులు అయినా ఓపికతో ఎదురుచూస్తాం
  • సరిలేరు మీకెవ్వరు కేసీఆర్ సార్: బండ్ల

తెలంగాణ డైనమిక్ సీఎం కేసీఆర్ పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని, కరోనా నియంత్రణకు కేసీఆర్ తీసుకునే ఎటువంటి చర్యకైనా ప్రజల నుంచి మద్దతు ఉంటుందని నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన నిన్న రాత్రి వరుసగా ట్వీట్లు చేశారు. "మా క్షేమం కోసం సమాజం కోసం మా పిల్లల కోసం మా భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆపై "నాలుగు రోజులు కాదుసార్   మీ మీద నమ్మకంతో మీరు ఉన్నారు అన్న భరోసాతో 40 రోజులు అయినా ఓపికతో ఇళ్ల కే పరిమితం అవుతూ విజయం సాధిస్తాం" అని ట్వీట్ చేశారు. "మీరు చేసే కార్యక్రమాలు మీరు తీసుకునే నిర్ణయాలు అన్ని భగవంతునితో జయప్రదం కావాలని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రేమ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.." అని, "ఈ కఠోరమైన సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి కేసీఆర్ నాయకత్వంలో పని చేసి తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని అందర్నీ వేడుకుంటూ.." అని బండ్ల గణేశ్ ట్వీట్ పెట్టారు.

దాని తరువాత, "భారతదేశ చరిత్రలో ఇటువంటి సమయాల్లో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు" అని, "మా క్షేమం కోసం సమాజం కోసం మా పిల్లల కోసం మా భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

KCR
Bandla Ganesh
Twitter
Tweets
  • Error fetching data: Network response was not ok

More Telugu News