Mopidevi Venkataramana: చంద్రబాబు ఏపీకి రావాలంటే 14 రోజులు క్వారంటైన్ కు వెళ్లాలి: మోపిదేవి

Mopidevi Venkataramana comments on Chandrababu

  • హైదరాబాదులో కూర్చుని మాట్లాడుతున్నారంటూ విమర్శలు
  • చంద్రబాబు డైరెక్షన్ లో నిమ్మగడ్డ పనిచేశారంటూ ఆరోపణలు
  • తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడిందని వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. చంద్రబాబు హైదరాబాదులో కూర్చుని మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు హైటెక్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఏపీకి రావాలంటే 14 రోజుల పాటు క్వారంటైన్ కు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు.

అటు నిమ్మగడ్డ రమేశ్ ను ఎస్ఈసీగా తొలగించడంపైనా మోపిదేవి స్పందించారు. చంద్రబాబు డైరెక్షన్ లో నిమ్మగడ్డ రమేశ్ పనిచేస్తున్నారని తెలిసిందని, విషయం తెలిసిన తర్వాత మార్చక తప్పని పరిస్థితి ఏర్పడిందని మోపిదేవి వెల్లడించారు. సందర్భాన్ని బట్టి కొన్నిగంటల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు సలహాలు ఇవ్వకుండా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Mopidevi Venkataramana
Chandrababu
Corona Virus
Quarantine Centre
Nimmagadda Ramesh
Andhra Pradesh
  • Loading...

More Telugu News